తొమ్మిది రోజుల్లో 'పెద్ది'కి వచ్చిన వసూళ్లు ఎంతంటే..?
- రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ వసూళ్లు
- 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల గ్రాస్
- ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్‌గా నిలిచిన మూవీ
- వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది.
ఈ నెల 4న భారీ అంచనాల మధ్య విడుదలైన 'పెద్ది', అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. ఈ కలెక్షన్లతో 2026లో ఇప్పటివరకు దక్షిణాదిలోనే నంబర్ వన్ గ్రాసర్‌గా తమ సినిమా నిలిచిందని చిత్రబృందం తెలిపింది. శని, ఆదివారాలు వారాంతం కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.